![]() |
![]() |
.webp)
ఒకవైపు బిగ్ బాస్, మరోవైపు బుల్లితెర ధారావాహికలు.. తెలుగు టీవీ అభిమానులకు మంచి కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. అయితే యాంకర్ అనసూయ, రష్మీ ఎప్పుడు తమ అందాల ఆరబోతతో ట్రెండింగ్ లో ముందు వరుసలో ఉంటారు.
అయితే వీరికి పోటీగా కొంతమంది సీరియల్ ఆర్టిస్టులు జాయిన్ అయ్యారు. బ్రహ్మముడి సీరియల్ లో అత్త పాత్ర చేస్తున్న రుద్రాణి అలియాస్ షర్మితా గౌడ తన అందాలతో ట్రెండింగ్ లో ఉంటే గుప్పెడంత మనసు సీరియల్ లో రిషికి అమ్మగా జగతి పాత్రలో చేస్తున్న జ్యోతి రాయ్ ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో కనువిందు చేస్తుంటుంది.
ఇప్పుడు ఈ అందాల ఆరబోత జాబితాలోకి స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న మల్లీ సీరియల్ లోని మల్లి అలియాస్ భావన లాస్య చేరింది. మల్లిగా అందరికి పరిచయమైన భావన లాస్య.. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో జన్మించింది. భావన తండ్రి రైల్వే ఉద్యోగి. కరోనా లాక్ డౌన్ సమయంలో తను చేసిన ఇన్ స్టాగ్రామ్ రీల్స్ కి విశేషమైన స్పందన రావడంతో, మల్లి సీరియల్ మేకర్స్ తనని సంప్రదించగా తను నటించడానికి ఒకే అంది. ఇప్పటివరకు టెలివిజన్ సీరియల్స్ లో నటించిన భావన లాస్యకి 'మల్లి' తన తొలి తెలుగు సీరియల్. కాగా ఇందులో లాస్య ప్రియ ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే.
టీవి యాక్టర్స్ ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ రీల్స్ తో ఫేమస్ అవుతున్నారు. అందులో బ్రహ్మముడి సీరియల్ టీమ్ టాప్ లో ఉన్నారు. కాగా ఇప్పుడు మల్లి సీరియల్ లోని లాస్య ప్రియ కూడా చేరింది. ఆ మధ్య 'సమ్మోహనుడ' పాటకి అదిరిపోయే లుక్స్‌తో హాట్ సారీతో డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఇప్పుడు తాజాగా ఎడారిలో ఇసుకతెన్నెల మీద తను రకరకాల స్టిల్స్ తో కనువిందు చేసింది. తన అందానికి ఇప్పటికే కుర్రాళ్ళు ఫిధా అవ్వగా.. ఇన్ స్టాగ్రామ్ లో హాట్ అండ్ బోల్డ్ స్టిల్స్ ని అప్లోడ్ చేసింది లాస్య. ఇక ఇప్పటికే ఈ ఫోటోకి తెగ కామెంట్లు వస్తున్నాయి. భావన లాస్య ఈ ఫోటోలతో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
![]() |
![]() |